రాజుగారి గది-2 టైటిల్ లోగో రిలీజ్

Saturday,August 26,2017 - 10:01 by Z_CLU

నాగార్జున లేటెస్ట్ మూవీ రాజుగారి గది-2 రిలీజ్ కు రెడీ అయింది. నిన్నట్నుంచి ఈ సినిమా ప్రచారాన్ని ఆఫీషియల్ గా ప్రారంభించారు. వినాయక చవితి కానుకగా రాజుగారి గది-2 టైటిల్ లోగోను ఆవిష్కరించారు. సూపర్ హిట్ అయిన రాజుగారి గది-2 సినిమాకు సీక్వెల్ గా ఇది రాబోతోంది.

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది-2 సినిమాలో నాగార్జున సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో సమంత నటిస్తోంది. పీవీపీ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

రాజుగారి గది-2లో మెంటలిస్ట్ గా నటిస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్స్ సినిమాపై అంచనాల్ని పెంచాయి. నాగ్ నటిస్తున్న మొట్టమొదటి హారర్ థ్రిల్లర్ సినిమా ఇదే.