రజనీకాంత్ ‘2.0’ హంగామా మొదలైంది

Saturday,August 26,2017 - 09:07 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 2.0 హంగామా మొదలైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరేయడం ద్వారా ఇప్పటికే ఆఫీషియల్ గా ప్రమోషన్ స్టార్ట్ చేసిన యూనిట్.. మేకింగ్ వీడియో రిలీజ్ తో తమ ప్రచారాన్ని మరింత పెంచింది

భారత దేశ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది 2.0. ఆ భారీతనం మేకింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. అటు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం విశేషం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రోడ్లు వేశారు. బిల్డింగ్ లు కట్టారు. ఏకంగా స్టేడియం నిర్మించారు. మేకింగ్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

ఇక మేకప్ కోసం రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఎఁత కష్టపడ్డారనే విషయం మేకింగ్ లో ఉంది. కేవలం మేకప్ కోసం ఒక రోజంతా రజనీకాంత్ కేటాయించారంటే ఇది ఏ రేంజ్ సినిమాలో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటలకు మేకప్ స్టార్ట్ చేస్తే, షూటింగ్ ప్రారంభమయ్యేసరికి సాయంత్రం 7 గంటలయ్యేది.

ఇక మేకింగ్ వీడియోలో రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందనే విషయాన్ని మేకింగ్ తో పాటు ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎలివేట్ చేసింది.