లవ టీజర్ కు 6 మిలియన్ డిజిటల్ వ్యూస్

Saturday,August 26,2017 - 11:02 by Z_CLU

సోషల్ మీడియాలో జై లవకుశ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న జై టీజర్ తో సోషల్ మీడియా దుమ్ముదులిపిన ఎన్టీఆర్.. తాజాగా లవకుమార్ టీజర్ తో మరోసారి తన సత్తా చాటాడు. ఈ టీజర్ కు ఇప్పటివరకు 60 లక్షల వ్యూస్ వచ్చాయి. ఫేస్ బుక్, యూట్యూబ్ తో కలుపుకొని ఈ వ్యూస్ వచ్చినట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది.

మరోవైపు ట్రెండింగ్ లో కూడా లవకుమార్ టీజర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 6 గంటల పాటు ట్విట్టర్ లో ఈ టీజర్ ట్రెండ్ అవ్వడం ఓ రికార్డు. ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్-రాశిఖన్నా మధ్య ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.