రజనీకాంత్ "కాలా" అప్ డేట్స్

Monday,May 29,2017 - 12:15 by Z_CLU

రజనీకాంత్ కాలా హంగామా మొదటి రోజు నుంచే షురూ అయింది. సెట్స్ పైకి వెళ్లకముందే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్ డిజైన్ నురిలీజ్ చేశారు. ఇక సెట్స్ పైకి వెళ్లిన మొదటి రోజే వర్కింట్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. కేవలం వర్కింగ్ స్టిల్స్ విడుదల చేయడమే కాకుండా.. సినిమాకు సంబంధించి ఫుల్ అప్ డేట్స్ ఇచ్చేసింది యూనిట్.

కాలా సినిమాలో హీరోయిన్లను ఫిక్స్ చేశారు. ఫస్ట్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీని, సెకెండ్ హీరోయిన్ గా అనిత పాటిల్ ను సెలక్ట్ చేశారు. ఇక కాలా సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ను సెలక్ట్ చేశారు. కబాలి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణ్ నే కాలా సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

ప్రస్తుతం ముంబయిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ మరో 2 వారాల పాటు కొనసాగుతుంది. తర్వాత చెన్నైలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కంటిన్యూ అవుతుంది. కుదిరితే ఈ సినిమాను రోబో 2.0 కంటే ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ ఏడాదే కాలా సినిమా విడుదలన్నమాట.