త్వరలోనే సెట్స్ పైకి మెగా మల్టీస్టారర్

Monday,May 29,2017 - 11:30 by Z_CLU

చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయిన విషయం తెలిసిందే. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్టును గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ అందించాడు సుబ్బరామిరెడ్డి. త్వరలోనే చిరంజీవి, పవన్ సినిమా ఓపెనింగ్ ఉంటుందని ప్రకటించారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ లో పవన్ తో చర్చలు జరిపారు సుబ్బరామిరెడ్డి. మరోవైపు చిరంజీవితో కూడా టచ్ లో ఉన్న టీఎస్ఆర్.. చిరు-పవన్ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం పవన్, చిరంజీవి చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే మెగా మల్టీస్టారర్ సెట్స్ పైకి వస్తుందని టీఎస్ఆర్ ప్రకటించారు.