రాజమౌళి RRR - నవంబర్ లో సెట్స్ పైకి

Monday,October 29,2018 - 11:19 by Z_CLU

ఆల్మోస్ట్ RRR ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేశారు ఫిల్మ్ మేకర్స్. భారీ బడ్జెట్ తో ఇద్దరు టాప్ మోస్ట్ స్టార్స్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షెడ్యూల్స్ ని కూడా దాదాపు డిజైన్ చేసుకుంది సినిమా యూనిట్. ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా రివీల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మ్యాగ్జిమం నవంబర్ లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు రానుంది రాజమౌళి అండ్ టీమ్.

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అరవింద సమేత’ తరవాత బ్రేక్ మోడ్ లో ఉన్న NTR ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం వర్కవుట్స్  బిగిన్ చేసిన యంగ్ టైగర్, RRR లో నెవర్ సీన్ బిఫోర్ లుక్స్ లో కనిపించనున్నాడు.

అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరగనున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ని మ్యాగ్జిమం NTR కాంబినేషన్ లో ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తర్వాత బ్రేక్ తీసుకుని సెకండ్ షెడ్యూల్ ని జనవరిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.