చిన్న సినిమాను సపోర్ట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్

Sunday,August 19,2018 - 01:19 by Z_CLU

టాలీవుడ్ లో ఓ ఫీల్ గుడ్ చిన్న సినిమా రిలీజ్ కి ముందే   స్టార్ డైరెక్టర్స్ సైతం ఎట్రాక్ట్ చేస్తూ హంగామా చేస్తుంది.  ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే టైటిల్ తో రియలిస్టిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాతో వెంకటేష్ మహా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి రానా ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఇటివలే సినీ ప్రముఖుల కోసం స్పెషల్ షో వేసారు యూనిట్. ఈ షో ద్వారా సినిమా చూసిన ప్రముఖులు ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలిగించి మంచి విజయం సాధిస్తుందంటూ వారి స్పందన తెలిపారు.

లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి , సుకుమార్ , క్రిష్ లతో పాటు మరికొందరు దర్శకులు  ‘C/O కంచరపాలెం’ గురించి వారి స్పందనను వీడియో ద్వారా తెలిపుతూ ఈ చిన్న సినిమాను ఓ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే  బాధ పడిన సందర్భాలున్నాయని, ఓవరాల్ గా  సినిమా  ఫీల్ గుడ్ సినిమాగా మనసుకు హత్తుకుంటుందని, దర్శకుడు ఎంతో అద్భుతంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాను  రూపొందించాడని, సినిమా చూసాక క్యారెక్టర్స్ మనతో పాటే వస్తాయని కచ్చితంగా ఈ సినిమాను అందరు చూడాలని  కోరారు.

సో రిలీజ్ కి ముందే స్టార్ డైరెక్టర్స్ ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల అవుతుంది. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించి రానా కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.