రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న '@నర్తన శాల'

Sunday,August 19,2018 - 12:14 by Z_CLU

నాగ శౌర్య హీరోగా శ్రీనివాస చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నర్తన శాల’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రెజెంట్  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆగస్ట్ 24 న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నట్లు తెలిపారు మేకర్స్.

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ సినిమాలో నాగ శౌర్య సరసాన కష్మీర, యామిని గౌతం హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ మహతి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.