శైలజారెడ్డి అల్లుడు నుంచి మరో వీడియో సాంగ్

Sunday,August 19,2018 - 03:12 by Z_CLU

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి మరో వీడియో సాంగ్ రిలీజైంది. ఎగిరెగిరే అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను అందమైన లొకేషన్ లో పిక్చరైజ్ చేశారు. చైతూ, అను మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది.

గోపీసుందర్ ఈ సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేయగా.. కృష్ణకాంత్ సాహిత్య అందించాడు. సిడ్ శ్రీరామ్, లిప్సిక ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన మంగ్లీ సాంగ్ సూపర్ హిట్ అవ్వగా, తాజాగా రిలీజైన ఈ వీడియో సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

ఈనెల 31న థియేటర్లలోకి రానున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మారుతి దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ-పీడీవీ ప్రసాద్ నిర్మించారు.