#Chiru155... కాంబినేషన్ ఫిక్స్

Sunday,June 07,2020 - 01:48 by Z_CLU

ప్రస్తుతం మెగాస్టార్ ఫోకస్ అంతా ‘ఆచార్య’ సినిమా మీదే ఉంది. ఈ సినిమాను ఫినిష్ చేయగానే సుజీత్ తో ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. అయితే వీటితో పాటే తన 155 సినిమాకు సంబంధించి కూడా త్రివిక్రమ్ తో చర్చలు జరుపుతున్నారట చిరంజీవి. అన్ని కుదిరితే మెగాస్టార్ 155 సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే 2-3 సార్లు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎనౌన్స్ మెంట్ వచ్చింది. చిరు తాజాగా ఆ సినిమాను సెట్ చేసుకునే పనిలోనే ఉన్నారట. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యే లోపే లూసిఫర్ రీమేక్ ను ఫినిష్ చేసి త్రివిక్రమ్ కి డేట్స్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నారట మెగాస్టార్.

మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న చిరు -త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కబోతుందన్నమాట. ప్రాజెక్టు ఓకే అయితే కొణెదల ప్రొడక్షన్స్, హారిక-హాసిని బ్యానర్లపై ఈ సినిమా వస్తుంది.