రాఘవ లారెన్స్ శివలింగ

Thursday,November 24,2016 - 02:33 by Z_CLU

హారర్ జోనర్ తెరకెక్కించడంలో కింగ్ లాంటి రాఘవ, మరో హారర్ క్రియేటివ్ డైరెక్టర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ ని తెరకెక్కించిన P. వాసు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు.

ముని సిరీస్, కాంచన లాంటి సినిమాలతో క్రియేటివ్ హారర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ, ఇప్పుడు మరో డైరెక్టర్ సినిమాలో నటించడం విశేషంగా మారింది. కన్నడలో ‘బ్లాక్ బస్టర్’ అయిన ‘శివలింగ’ సినిమాకి రీమేక్ వర్షన్ గా అదే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు సినిమా యూనిట్. ఈ సినిమాలో రాఘవ సరసన రితిక సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.