#Radheshyam - వాలెంటైన్స్ డే గ్లిమ్స్

Monday,February 14,2022 - 03:48 by Z_CLU

Radheshyam Valentines Day Glimpse

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’ నుండి వాలెంటైన్స్ డే గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. లవ్ సీన్స్ తో వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల గ్లిమ్స్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది. ముప్పై సెకన్లతో కట్ చేసిన గ్లిమ్స్ లో అందరినీ ఆకట్టుకునే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రభాస్ -పూజ మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ పాటు యూరప్ లోకేషన్స్ , ప్లీసెంట్ మ్యూజిక్ తో పాటు గ్లిమ్స్ ఎండింగ్ లో ” ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెల్లెందుకు కాలేదు” అంటూ పూజ ప్రభాస్ ని అడిగే సీన్ ప్రభాస్ ఏం చెప్పలేక ఇబ్బంది పడటం హైలైట్ గా నిలిచాయి. నిజజీవితంలో ప్రభాస్ కి ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్నే పూజ అడగడం గ్లిమ్స్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.

ఓవరాల్ గా ప్రేమికుల రోజు సందర్భంగా ఎట్రాక్ట్ చేసే విజువల్స్ , లవ్ సీన్స్ తో రాధేశ్యామ్ నుండి మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ అందింది. ఈరోజు సాయంత్రం వాలెంటైన్స్ డే స్పెషల్ గా టీం హైదరాబాద్ లోని కెమిస్ట్రీ పబ్ లో నైట్ థీం ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి యూనిట్ హాజరుకానున్నారు. ఈ ఈవెంట్ కి కొంత మంది లవర్స్ ని ఇన్వైట్ చేశారు ఈవెంట్ ప్లానర్స్.