F3 Movie - కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,February 14,2022 - 03:56 by Z_CLU

New Release date for F3 Movie

విక్టరీ వెంకటేశ్ , మెగా ప్రిన్స్ వరుణ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న F3 సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి రిలీజ్ కి రెడీ చేద్దామనుకున్నారు. కానీ సంక్రాంతి భారీ సినిమాలు వస్తాయని ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. మొన్నీ మధ్య మరో డేట్ చెప్పారు. ఏప్రిల్ 28న సినిమా థియేటర్స్ లోకి రానుందని తెలిపారు. అయితే ఇప్పుడు మరో రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 27న సినిమా థియేటర్స్ లోకి రానుందని చెప్పారు.

ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. అందుకోసమే మళ్ళీ F3 సినిమాను ఉన్నపళంగా వాయిదా వేసుకున్నారు. ఫైనల్ గా ఈసారి ఈ డేట్ ఫిక్స్ అన్నట్టుగా ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తో చెప్పారు. స్టూడెంట్స్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సమ్మర్ ఎండింగ్ లో వస్తున్నట్లు చెప్పుకున్నారు. అయితే మే నెలలో మహేష్ ‘సర్కారు వారి పాట’ , గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, అడివి శేష్ ‘మేజర్’ రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయి. అలాగే మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్స్ లోకి రానున్నాయి.

ఇలా బడా సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాతో సమ్మర్ ని మూవీ ఫెస్టివల్ గా మర్చనున్నాయి. మరి సమ్మర్ ఎండింగ్ లో ఈ సినిమాలతో థియేటర్స్ కిక్కిరిసిపోవడం ఖాయం.