వెంకీ మామ కోసం మరో హీరోయిన్ వెయిటింగ్?

Friday,February 22,2019 - 10:56 by Z_CLU

హీరోయిన్స్ విషయంలో వెంకీ మామ ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ రోజుకోసారి మారిపోతోంది. ముందుగా వెంకీ సరసన శ్రియను అనుకున్నారు. ఆమె స్థానంలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య వంతు.

సినిమాలో చైతూ సరసన ముందుగా రకుల్ ప్రీత్ ను అనుకున్నారు. కానీ ఆమె స్థానంలో నభా నటేష్ ను తీసుకున్నారు. ఇప్పుడు నభాను కూడా తీసేసి ఆమె ప్లేస్ లో రాశిఖన్నాను తీసుకున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మేకర్స్ మాత్రం హీరోయిన్స సెలక్షన్ పై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాబి దర్శకత్వంలో మరో 2 రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.