మరో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన వెంకీ మామ

Friday,June 14,2019 - 04:24 by Z_CLU

నాగచైతన్య, వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమాలో ఓ పోర్షన్ లో మిలట్రీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఈ సన్నివేశాల షూట్ కోసం యూనిట్ కశ్మీర్ వెళ్లింది. ఇప్పుడా షెడ్యూల్ కంప్లీట్ అయింది.

దాదాపు 25 రోజుల పాటు జరిగిన భారీ షెడ్యూల్ ఇది. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ సీన్స్ ను షూట్ చేశారు. హీరో నాగచైతన్యతో పాటు వెంకటేష్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. కశ్మీర్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అవుతుందని భావిస్తోంది యూనిట్

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. మూవీలో చైతూ సరసన రాశిఖన్నా, వెంకీ సరసన పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు.