టెంపర్ రీమేక్ లో రాశి ఖన్నా

Thursday,March 22,2018 - 11:59 by Z_CLU

తెలుగులో ఇప్పటికే లీడింగ్ లో ఉన్న హీరోయిన్ అనిపించుకున్న రాశి ఖన్నా ఇప్పుడు కోలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఓ మంచి సక్సెస్ తో తమిళనాట కూడా క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగా విశాల్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. అది కూడా ఓ హిట్ తెలుగు సినిమా రీమేక్ కావడం విశేషం.

తెలుగులో ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయింది టెంపర్. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్ లో కూడా రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్ లో విశాల్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలోనే హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికైంది. అంటే తెలుగులో కాజల్ చేసిన పాత్రను తమిళ్ లో రాశిఖన్నా చేయబోతోందన్నమాట.

ఏఆర్ మురుగదాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకట్ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.