'సాహో' కి అన్నీ కలిసొచ్చాయి... బిగ్గెస్ట్ హిట్ పక్కా

Thursday,March 22,2018 - 12:43 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది… యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరెక్షన్ లో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కి అన్నీ కలిసొస్తున్నాయి. అందులో ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఈ సినిమాకు సంబంధించి అన్నీ ఏరియాల ప్రీ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని సమాచారం. శ్రద్దా కపూర్ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రద్దా తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇది.

మొదటి సినిమాతోనే దర్శకుడిగా తన సత్తా నిరుపించుకొని సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్…. డైరెక్టర్ చేస్తున్న రెండో సినిమా కావడంతో దర్శకత్వ పరంగానూ ఈ సినిమాపై పాజిటీవ్ వైబ్స్ నెలకొంటున్నాయి. మిర్చి తర్వాత ప్రభాస్ యు.వి బ్యానర్ లో నటిస్తున్న రెండో సినిమా కావడంతో ప్రారంభం నుండే ఈ సినిమాపై హైప్ వచ్చింది. సినిమా బాగుంటే ఎంతైనా ఖర్చు పెట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసే నిర్మాణ సంస్థ యు.వి ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. సో క్వాలిటీ వైస్ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

ఇక నేల్ నితిన్ ముకేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్,మందీరా బేడి వంటి నటీ నటులు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుండడంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఫైనల్ గా ప్రభాస్ స్టైలిష్ లుక్, హాలీవుడ్ రేంజ్ లో ఉండే ఫైట్స్, సుజీత్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు, సాంగ్స్ ఇలా అన్నీ కలిపి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘సాహో’ ఇటు ఫాన్స్ ను అటు ఆడియన్స్ ఫుల్ ఫ్లేడ్జ్ గా ఎంటర్టైన్ చేసి బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.