చిరుకు స్వయంకృషి.. చరణ్ కు రంగస్థలం

Thursday,March 22,2018 - 10:33 by Z_CLU

ఇప్పటికే ఎంతోమంది ఈ మాటన్నారు. మెగాస్టార్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ చెప్పమంటే స్వయంకృషి సినిమాను ఎవరూ మరిచిపోరు. చిరు కెరీర్ లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటి స్వయంకృషి. ఇప్పుడు చరణ్ కు కూడా అలాంటి బెస్ట్ సినిమానే వచ్చింది. అదే రంగస్థలం.

నిజానికి చిరంజీవికి స్వయంకృషి లాంటి సినిమా పడ్డానికి చాలా ఏళ్లు పట్టింది. కానీ చరణ్ కు మాత్రం కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లకే రంగస్థలం లాంటి సినిమా పడింది. తన సినిమాల్ని చూడమని చరణ్ ఎప్పుడూ చెప్పడు. కానీ రంగస్థలం సినిమాను మాత్రం ఓసారి చూడమని చెబుతున్నాడు. నిజమే ఓ సరికొత్త అనుభూతి కావాలంటే రంగస్థలం చూడాల్సిందే.

మరోవైపు ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 210 లొకేషన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓవర్సీస్ రిలీజ్ ఇది. ఈనెల 29 నుంచే ఓవర్సీస్ లో ఈ సినిమా హంగామా మొదలుకానుంది.