రాహు దర్శకుడు సుబ్బు ఇంటర్వ్యూ

Wednesday,February 26,2020 - 12:45 by Z_CLU

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించిన సినిమా రాహు. ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు వేదుల మీడియాతో మాట్లాడాడు..

అలా ఇండస్ట్రీకొచ్చా..
నాది వైజాగ్, న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ సమయంలో కోనా వెంకట్ నాకు పరిచయం, మేమిద్దరం కలిసి కొన్ని స్టోరీస్ కు వర్క్ చేశాము. కొన్ని అనుకోని కారణాల వల్ల కోనా వెంకట్ గారితో గీతాంజలి 2 సినిమా స్టార్ట్ కాలేదు. కానీ నా ప్రయత్నాలు ఆపలేదు.

డిఫరెంట్ స్టోరీలైన్
రాహు సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడు బ్లైండ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో ఇంటరెస్టింగ్ గా చూపించడం జరిగింది. సినిమా కంప్లీట్ గా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మేకింగ్ స్టయిల్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా ఉండబోతోంది.

మృగం స్క్రిప్ట్ రెడీ
కొత్త దర్శకుడిగా నేను పెద్ద స్టార్ట్స్ తో చేయాలంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కావున ఈ సినిమా తరువాత నేను స్టార్ట్స్ ను అప్రోచ్ అవుతాను. ఒక స్టార్ హీరో కోసం మృగం అనే సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది.

నా ఫేవరెట్ డైరక్టర్
చంద్రశేఖర్ యేలేటి గారి సినిమాలంటే ఇష్టం. అనుకోకుండా ఒకరోజు సినిమా నా ఫెవరేట్.

నిర్మాతగా కూడా…
నా కథ మీద నమ్మకంతో నేను ఈ సినిమాకు ఒక నిర్మాతగా కూడా వ్యవహరించాను. మా నిర్మాతలు బాబ్జి, స్వామి గార్ల సహకారం మరువలేనిది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న రాహు సినిమా కచ్చితంగా అందరికీ ఓ కొత్తదనం అందిస్తుంది. ఈ సినిమాలో కథే హీరో.