హాట్ టాపిక్ : మెగాస్టార్ మూవీలో మహేష్ క్యారెక్టర్ ఇదే!

Wednesday,February 26,2020 - 12:28 by Z_CLU

చిరంజీవి-కొరటాల సినిమా ఆచార్య. ఇందులో మహేష్ బాబు నటించబోతున్నాడంటూ 2 రోజులుగా తెగ ఫీలర్లు వస్తున్నాయి. అయితే ఇది జస్ట్ గాసిప్ మాత్రమే కాదు. ఆల్ మోస్ట్ ఫిక్స్. ఈ సంగతి పక్కనపెడితే.. చిరంజీవి సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు మీకు ఎక్స్ క్లూజివ్ గా చెప్పబోతున్నాం.

ఆచార్య మూవీలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు మహేష్. ఈ మేరకు నిన్ననే సూపర్ స్టార్ కు ఫుల్ నెరేషన్ ఇచ్చాడు కొరటాల. మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ రన్ టైమ్ 25 నుంచి 30 నిమిషాల వరకు ఉండొచ్చు. కాల్షీట్లు కూడా 25 రోజులు సరిపోతాయి.

అప్పుడెప్పుడో వచ్చిన సైనికుడు సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించాడు మహేష్. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల నెరేషన్ కాబట్టి కచ్చితంగా క్యారెక్టర్ అదిరిపోతుంది. అందులో నో డౌట్. కాకపోతే కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. మహేష్ ఓకే చెప్పాడని టాక్. ఫైనల్ టాక్స్ నడుస్తున్నాయి.