పూరి బాలయ్య సినిమా లాంచ్ అయింది

Thursday,March 09,2017 - 12:03 by Z_CLU

బాలయ్య 101 సినిమా లాంచ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి S.S. రాజమౌళి క్లాప్ కొట్టారు. కూకట్ పల్లి టెంపుల్ లో జరిగిన కార్యక్రమంలో క్రిష్, బోయపాటి, S.V. క్రిష్ణారెడ్డి కూడా అటెండ్ అయ్యారు.

పూరి హీరో అంటేనే కాస్త రఫ్ లుక్స్ దానికి తోడు డ్యా షింగ్ మ్యానరిజం, ఇక బాలయ్య విషయానికి వస్తే తన ప్రతి సినిమాలో తన స్టైల్ భారీ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేస్తాడు. కాంబినేషన్ డిఫెరెంట్ అయినా, బాలయ్యని ఈ సారి యూనిక్ స్టైల్ లో ప్రెజెంట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

తన 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణీలో కింగ్ లా మెస్మరైజ్ చేసిన బాలయ్య, ఈ సారి పూరి డైరెక్షన్ లో మాస్ & ఎనర్జిటిక్ లుక్స్ లో ఎంటర్ టైన్ చేయడానికి అంతా సెట్ అయినట్టే. ప్రీ ప్రొడక్షన్ ఆల్ రెడీ కంప్లీట్ చేసేసుకున్న ఈ సినిమా ఇంకా తక్కిన కాస్ట్ ని, టెక్నికల్ టీం ని ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉంది.