కాంబినేషన్ సెట్ గురు...

Thursday,March 09,2017 - 09:04 by Z_CLU

టాలీవుడ్ లో ప్రెజెంట్ కొన్ని కేజ్రీ కాంబినేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి.. ఇక ఇప్పటి వరకూ ఊహించని కొన్ని కాంబోస్ ప్రస్తుతం సెట్స్ పై ఉండగా మరికొన్ని  త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. అలా ఆడియన్స్ లో క్యూరాసిటీ కలిగిస్తున్న కాంబినేషన్స్ పై ఓ లుక్కేద్దాం..

టాలీవుడ్ లో ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారిన కాంబో అంటే టక్కున వినిపించే కాంబో బాలయ్య పూరీలదే.. ఇప్పటి వరకూ ఎవరు ఊహించని కాంబినేషన్ సెట్ చేసుకొని త్వరలోనే తమ కాంబోతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు వీరిద్దరూ… ఈ మోస్ట్ ఏవైటింగ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 29 వరకూ వెయిట్ చేయాల్సిందే…

ఇక టాలీవుడ్లో మరో హాట్ టాపిక్ కాంబో మెగా స్టార్ సురేందర్ రెడ్డి లదే.. లెటస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చిన చిరు లైన్ లో చాలా మంది దర్శకులన్నప్పటికీ సురేందర్ కె ఛాన్స్ ఇచ్చి 151 సినిమా చేస్తుండడంతో ఈ కాంబో లో రూపొందే సినిమా పై భారీ అంచానాలే నెలకొన్నాయి..

నాగార్జున ఓంకార్ కాంబినేషన్ కూడా క్రేజీ కాంబో లిస్ట్ లో ఉంది.. రాజు గారి గది సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు ఓంకార్ నాగార్జున తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ కాంబోలలో ఒకటిగా నిలిచింది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ లది కూడా మోస్ట్ క్రేజీ కాంబో అనే చెప్పాలి… తన ప్రతీ సినిమాలో సరి కొత్త హీరోయిజం చూపించే సుకుమార్ రామ్ చరణ్ తో తెరకెక్కించే సినిమా ఫస్ట్ లుక్ తోనే భారీ క్రేజ్ సంపాదించాడు… చరణ్ లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించబోయే ఈ సినిమా కోసం వీరిద్దరి కాంబినేషన్ కోసం ఇప్పటి నుంచే ఎదురు చూపులు స్టార్ట్ అయిపోయాయి….

లేటెస్ట్ గా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కాంబినేషన్ ను సెట్స్ చేసుకొని త్వరలోనే తమ కాంబో తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ త్రివిక్రమ్… ప్రస్తుతానికి అనౌన్స్ మెంట్ స్టేజీ లోనే ఉన్న ఈ పర్ఫెక్ట్ కాంబో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది…

టాలీవుడ్ లో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారిన కాంబో బన్నీ వక్కంతం కాంబినేషన్.. మొన్నటి వరకూ కేవలం వార్త గానే వినిపించిన ఈ కాంబో త్వరలోనే సరి కొత్త ఎంటర్టైన్ మెంట్ అందించడానికి రెడీ అవుతుంది..ఈ సినిమాతో రచయిత నుంచి దర్శకుడిగా మారబోతున్న వక్కంతం ఇప్పటికే బన్నీ కి అదిరిపోయే స్క్రిప్ట్ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.. సో మొన్నటి వరకూ సోషల్ మీడియా లో హల్చల్ చేసిన ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది..

దాదాపు ఏడాది నుంచి ఊరిస్తున్న రామ్ చరణ్ మణిరత్నం కాంబో కూడా త్వరలోనే పట్టాలెక్కపోతుంది… ఇప్పటికే ఈ కాంబోలో తెరకెక్కే సినిమాకు స్క్రిప్ట్ కూడా రెడీ చేసిన మణిరత్నం త్వరలోనే చెర్రీ ని మరో సారి లవర్ బాయ్ గా మార్చబోతున్నాడు.. ప్రస్తుతం అనౌన్స్ మెంట్ స్టేజి కి చేరుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది..

ఇక నాగ చైతన్య కూడా ఊహించని కాంబో ను సెట్ చేసేసుకొని సెట్స్ పైకి వెళ్ళిపోయాడు. నాగార్జున కి ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో ప్రస్తుతం సెట్స్ లో ఉన్న చైతు ఈ కాంబో తో అందరిలోనూ క్యూరాసిటీ కలిగిస్తున్నాడు…