నాని ‘నిన్ను కోరి’ U.S. షెడ్యూల్ కి ప్యాకప్

Thursday,March 09,2017 - 12:45 by Z_CLU

సరిగ్గా నేను లోకల్ రిలీజ్ రోజు U.S. లో ఉన్నాడు నాని… ‘నిన్ను కోరి’ సినిమా యూనిట్ తో సహా. అప్పటి నుండి ఏ మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, మొత్తానికి U.S. షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది.

నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ నిర్వాణ డైరెక్టర్, గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ రెడీ బ్యా టు బ్యాక్ హిట్స్ ని బ్యాగ్ లో వేసుకుంటున్న నాని ఈ సినిమాలో డిఫెరెంట్ మ్యానరిజం తో ఎట్రాక్ట్ చేయడం గ్యారంటీ అని టాలీవుడ్ లో టాక్.

ఆల్ రెడీ సగానికి పైగా టాకీపార్ట్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ ప్రస్తుతం బ్యాక్ టు ఇండియా మోడ్ లో ఉంది. ఇండియా వచ్చీ రాగానే,బిగిన్ చేయాల్సిన షెడ్యూల్ ని ఆల్ రెడీ ప్లాన్ చెసుకున్న సినిమా యూనిట్, ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా తక్కిన సినిమా షూటింగ్ కి కూడా ప్యాకప్ చెప్పేసి ఏ మాత్రం డిలేస్ లేకుండా జూలై 7 న సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.