నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు హీరోగా సినిమా

Monday,January 07,2019 - 06:42 by Z_CLU

ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ ఆవార్డ్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇప్పుడు ధర్మపథ క్రియేషన్స్ పై ఓ లేడీ డైరెక్టర్ ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు. అందులో తన కుమారుడు శివ కందుకూరి హీరోగా కనిపించబోతున్నారు.

శివ కందుకూరి అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు. ఇంతకు ముందు ప్రముఖ దర్శకులు సుకుమార్ మరియు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెసిన శేష సింధు రావ్ ని ఈ చిత్రంతో దర్శకురాలుగా రాజ్ కందుకూరి పరిచయం చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గొపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన 96 చిత్రం ఫేం వర్ష, హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు మరియు మధుర శ్రీధర్ లు ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పొషిస్తున్నారు.

నటీనటులు..
శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ

సాంకేతిక నిపుణులు..
దర్శకురాలు: శేష సింధు రావు
నిర్మాత: రాజ్ కందుకూరి
నిర్మాణ సంస్థ: ధర్మపత క్రియేషన్స్
సమర్పకులు: దగ్గుపాటి సురేష్ బాబు, మధురా శ్రీధర్
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: వేద వర్మ
మాటలు, స్క్రీన్ ప్లే: పద్మావతి విశ్వేశ్వర్