'యాత్ర' ట్రైలర్ రివ్యూ

Monday,January 07,2019 - 05:56 by Z_CLU

దివంగత మాజీ ముఖ్యమంత్రి Y.S.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ మూవీ ట్రైలర్ రిలీజయింది. మళయాళ సూపర్ స్టార్ ‘మమ్ముట్టి’ YSR గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ 1 : 59 సెకన్ల థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు.

“ఇది హైకమాండ్ నిర్ణయం రెడ్డి” అనే డైలాగ్ తో మమ్ముట్టీ క్లోజ్ షాట్ తో మొదలైన ఈ ట్రైలర్ “నాకు వినపడుతుందయ్యా” అనే డైలాగ్ తో ఎండ్ అయింది. 2003 లో వైస్సార్ చేసిన పాద యాత్ర దానికి ముందు… వెనుక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న మేకర్స్ సినిమాలోని యాత్ర కి సంబంధించిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ని కట్ చేసారు. ముఖ్యంగా పంచెకట్టులో పొలిటికల్ లీడర్ గా YSR ని గుర్తు చేస్తున్నాడు మమ్ముట్టీ. తన పాత్రకు మమ్ముట్టీ స్వయంగా తెలుగులో  డబ్బింగ్ చెప్పడం విశేషం.

ముఖ్యంగా ట్రైలర్ ప్రారంభంలో “నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కానీ….జనాలకేం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలని ఉంది.. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్ళాలనుంది” అంటూ మమ్ముట్టీ గడప దాటుతున్న షాట్ ఆ తర్వాత శంఖారావం పూరిస్తున్న షాట్ యాత్ర ప్రారంభించే ముందు జనల జైజైలు ఇలా సినిమాలోని కొని మెయిన్ ఎలిమెంట్ ని ట్రైలర్ లో జతచేర్చారు. ఇవన్నీ స్వర్గీయ వైస్సార్ ని మళ్ళీ జనాలకు గుర్తుచేసేలా ఉన్నాయి. అలాగే “మాటిచ్చే ముందు ఆలోచించాలి ఇచ్చాక ఆలోచించాల్సిందేముంది ముందు కెళ్ళాల్సిందే”,”అన్నిటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో,గుండె జబ్బో కదయ్యా పేదరికం…పేదరికాన్ని మించిన శిక్షే లేదయ్యా. ” అనే డైలాగ్స్  ఎట్రాక్ట్ చేసాయి. ఇక ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ‘కే’ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్ గా నిలిచింది.