Kaarthikeya2 - సీక్వెల్ లో నాని హీరోయిన్?

Tuesday,September 29,2020 - 01:24 by Z_CLU

ప్రస్తుతం హీరో Nikhil చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ‘Karthikeya 2’ ఒకటి. Chandoo Mondeti డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతుంది.

Priyanka_Mohan_Stills_zeecinemalu

మొన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. తాజాగా Priyanka Arul Mohan ని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ప్రియాంక ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. సినిమాలో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించడంతో లేటెస్ట్ గా ప్రియాంక ను ఫిక్స్ చేసుకున్నారట. ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

People Media factory నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించనున్నాడు.