నేచురల్ స్టార్ లిస్ట్ .. మరో ఇద్దరు రెడీ !

Sunday,March 03,2019 - 02:14 by Z_CLU

మెహ్రీన్, నివేత థామస్ , అను ఇమ్మానుయెల్ ఇలా చెప్పుకుంటూ పోతే నేచురల్ స్టార్ నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లిస్టు చాలానే ఉంది.  నాని ఇంట్రడ్యూస్  చేసిన  కొందరు హీరోయిన్స్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరీర్ తో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు.

ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్స్ ని పరిచయం చేయబోతున్నాడు నేచురల్ స్టార్. నాని అప్ కమింగ్ మూవీ ‘జెర్సీ’ తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది శ్రద్దా శ్రీనాథ్.  కన్నడ , తమిళ్ లో సినిమాలు చేసిన శ్రద్దాకి తెలుగులో ఇదే మొదటి సినిమా.

ఇక విక్రం కుమార్ -నాని కాంబోలో తెరకెక్కుతున్న’ గ్యాంగ్ లీడర్’ సినిమాలో కూడా కొత్త అమ్మాయినే తీసుకున్నారు. ఈ సినిమాతో  ప్రియాంక ఆరుళ్ మోహన్   హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో శ్రద్దా శ్రీనాథ్ , ప్రియాంకను హీరోయిన్స్ గా పరిచయం చేయబోతున్నాడు నేచురల్ స్టార్. మరి ఈ ఇద్దరూ టాలీవుడ్ లో  సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా కొనసాగుతారా..లేదా చూడాలి.