Sukumar - స్పీడ్ పెంచబోతున్న దర్శకుడు

Tuesday,September 29,2020 - 01:36 by Z_CLU

Creative Director Sukumar ఇండస్ట్రీకొచ్చి పదహారేళ్ళవుతోంది. ఇన్నేళ్ళ కెరీర్ లో సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలు కేవలం ఏడు మాత్రమే. సుకుమార్ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. వర్క్ విషయంలో Sukumar Perfectionist . ఒక్క ముక్కలో చెప్పాలంటే స్లో అండ్ స్టడీ ఫార్మేట్ లో సినిమాలు చేస్తుంటాడు. అందుకే ఆయన తీసిన సినిమాలను వేళ్ళపై లెక్కపెట్టొచ్చు.

అయితే ఇదంతా ‘పుష్ప’ సినిమాకి ముందు. ఇప్పుడు సుకుమార్ తన పంథా మార్చుకోవడానికి రెడీ అవుతున్నాడు. నిన్న సుకుమార్ నుండి వచ్చిన Vijay Deverakonda సినిమా ఎనౌన్స్ మెంటే దీనికి చక్కని ఉదాహరణ.

అవును… ‘Pushpa’ తర్వాత స్పీడు పెంచి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు సుక్కు. ఒక సినిమా సెట్ పై ఉండగా మరో సినిమాను ఎనౌన్స్ చేయలేదు సుకుమార్. ఇలా చేయడం ఇదే మొదటి సారి. సో ఇకపై జెట్ స్పీడులో సినిమాలు చేసి ఏడాదికో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు క్రియేటివ్ డైరెక్టర్. మరోవైపు నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా కూడా బిజీ అవుతున్నాడు.