సీనియర్ జూనియర్ - బిజీ బిజీ

Friday,May 31,2019 - 11:02 by Z_CLU

బిజీ బిజీగా ఉన్నారు సీనియర్ హీరోలు… ఒక్కొక్కరి కోసం స్క్రిప్ట్ దగ్గరి నుండి ప్రీ ప్రొడక్షన్ వరకు కంప్లీట్ చేసుకుని వెయిటింగ్ లిస్టులో ఉన్నారు డైరెక్టర్స్… అయితే జూనియర్స్ ఏమైనా బ్రేక్ తీసుకుంటున్నారా..? అస్సలు లేదు.. సీనియర్స్ కి ధీటుగా అంతే బిజీగా ఉన్నారు… స్టైల్ దగ్గరి నుండి మ్యానరిజం వరకు ఎక్కడా మ్యాచ్ అవ్వనివ్వకుండా ఎవరికీ వారే స్పెషల్ అనిపించుకుంటూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు.

చిరంజీవిరామ్ చరణ్ : మెగాస్టార్ ప్రస్తుతం ‘సైరా’ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరవాత కొరటాల శివతో సినిమా చేస్తాడు… ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా రాలేదు కానీ, త్రివిక్రమ్ సినిమాతో ఆల్రెడీ సినిమా కూడా అనౌన్స్ అయిపోయింది. ఇక మెగా పవర్ స్టార్ RRR తో బిజీ బిజీగా ఉన్నాడు…

వెంకటేష్రానా దగ్గుబాటి : ‘వెంకీమామ’ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. మరోవైపు త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ సినిమా కన్నా ముందే ‘F3’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ. మరో వైపు వెంకీ జూనియర్ రానా ‘విరాటపర్వం’ సినిమాతో పాటు మరిన్ని హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

నాగార్జుననాగ చైతన్య, అఖిల్ : యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు నాగార్జున. ఇప్పటికీ ‘మన్మధుడు 2’ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ చేస్తూ, కథ ఎలాంటిదైనా తనకు సూట్ అవుతుందనిపించుకుంటున్నాడు. మరోవైపు అక్కినేని జూనియర్స్ అఖిల్, నాగచైతన్యలు కూడా అంతే బిజీగా ఉన్నారు.