ప్రతి రోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్

Saturday,December 21,2019 - 04:04 by Z_CLU

సాయితేజ్-మారుతి ఫ్రెష్ కాంబోలో వచ్చిన ప్రతి రోజూ పండగే సినిమాకు మొదటి రోజు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇంతకుముందు సాయితేజ్ నుంచి వచ్చిన చిత్రలహరి (ఫస్ట్ డే 3 కోట్లు) కంటే ఇది కాస్త ఎక్కువే.

మూవీ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు యూనిట్ వినూత్నంగా ప్రమోషన్ ఇవ్వడంతో సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ డే రెస్పాన్స్ కూడా పాజిటివ్ గా ఉండడంతో.. ఈ వీకెండ్ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ సినిమా. పాజిటివ్ టాక్ రావడంతో.. నెక్ట్స్ వీకెండ్ నాటికి మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.

మొదటి రోజు వసూల్లు (షేర్)
నైజాం – రూ. 1.25 కోట్లు
సీడెడ్ – రూ. 0.34 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.43 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.22 కోట్లు
గుంటూరు – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు
కృష్ణా – రూ. 0.21 కోట్లు