రూలర్ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,December 21,2019 - 04:21 by Z_CLU

బాలకృష్ణ సినిమాలకు చాలా ఏరియాల్లో ఓపెనింగ్స్ తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలే. అందుకే రూలర్ పై కూడా పెద్దగా అంచనాల్లేవ్ ఆ అంచనాలకు తగ్గట్టే నిన్న థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా 4 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 21 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. హిట్ టాక్ వస్తే ఇంతకు మూడింతలు రాబట్టే సత్తా బాలయ్యకు ఉంది. కానీ రూలర్ కు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీంతో సోమవారం నుంచి ఈ సినిమా పరిస్థితి ఏంటనేది డౌట్.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 0.68 కోట్లు
సీడెడ్ – రూ. 0.95 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.27 కోట్లు
ఈస్ట్ – రూ. 0.26 కోట్లు
వెస్ట్ – రూ. 0.25 కోట్లు
గుంటూరు – రూ. 1.20 కోట్లు
నెల్లూరు – రూ. 0.22 కోట్లు
కృష్ణా – రూ. 0.19 కోట్లు