Prasanth Varma HANU-MAN - ప్రశాంత్ వర్మ నుంచి మరో ప్రయోగం

Sunday,May 30,2021 - 07:58 by Z_CLU

తెలుగుతెరపై సూపర్‌ హీరోస్‌ సినిమాలను ఈ తరం ప్రేక్షకులు ఇప్పటివరకు చూసింది లేదు. ‘జాంబీరెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్‌ జానర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి మరింత కొత్తగా, లార్జ్‌ స్కేల్‌లో ఈ చిత్రం ఉండబోతుంది అని తెలిపారు.

తన బర్త్‌ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సినిమాటిక్‌ యూనివర్స్‌లో సూపర్‌హీరోస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉండనుంది. ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’ టైటిల్, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి.

హాలీవుడ్‌ను సూపర్‌హీరోస్‌ మూవీస్‌ రూల్‌ చేస్తున్నాయి. డిస్నీ, మార్వెల్‌ సూపర్‌హీరోస్‌ ఫిల్మ్స్‌ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఇటీవల విడుదలైన సూపర్‌హీరో ఫిల్మ్‌ ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళను రాబట్టింది.

భారతీయ పురాణాల నుంచి ‘హను-మాన్’ సినిమాకు స్ఫూర్తి పొందాము. భారతీయులుకు ‘హనుమాన్‌’ సూపర్‌హీరో. ఈ సినిమా టైటిల్‌లో హను మాన్ మధ్యలో వజ్రంతో ఉన్న సూర్యుడి లొగొ ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.
Prashanth Varma
ఇప్పటికే విడుదలైన ‘హనుమాన్‌’ మోషన్‌ పోస్టర్‌ విజువల్‌ అద్భుతంగా ఉండి మంచి స్పందన లభిస్తుంది. మోషన్‌ పోస్టర్‌లోని హిమాలయాల విజువల్స్‌ అత్యద్భుతంగా, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్‌గా ఉంది. ‘హనుమాన్‌’ చిత్రం సరికొత్తగా ఉంటూ ఎగ్జైటింగ్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics