ZeeCinemalu - May 29

Friday,May 28,2021 - 09:29 by Z_CLU

santosham-movie-సంతోషం-zeecinemalu

సంతోషం
నటీనటులు – నాగార్జున, శ్రియ, ప్రభుదేవా, గ్రేసీసింగ్, సునీల్ తదితరులు
సంగీతం – ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం – దశరథ్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
రిలీజ్ – 2002, మే 9
నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి సంతోషం. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, కింగ్ నాగ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. హార్ట్ టచింగ్ స్టోరీని దర్శకుడు దశరథ్, అంతే హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు. హీరోయిన్ గ్రేసీ సింగ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక మరో హీరోయిన్ శ్రియ, ఎప్పట్లానే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. థీమ్ సాంగ్ తో కలిపి మళ్లీ మళ్లీ హమ్ చేసుకునేలా మొత్తం 8 ట్యూన్స్ ఇచ్చాడు ఆర్పీ పట్నాయక్.

========================

orey-bujjiga-telugu-movie-zeecinemalu

ఒరేయ్ బుజ్జిగా
నటీనటులు: రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి,
సప్తగిరి, రాజా రవీంద్ర, మధునందన్‌ తదితరులు.
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
మాటలు: నంద్యాల రవి
ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.
రన్ టైమ్ : 2 గంటల 28 నిమిషాలు
రిలీజ్ డేట్ : అక్టోబర్ 1
బుజ్జి (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్)ది ఒకటే ఊరు. కానీ ఎక్కువగా బయట చదువుకోవడం వల్ల ఒకరంటే ఒకరికి తెలియదు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన బుజ్జికి పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (పోసాని). అదే టైమ్ లో కృష్ణవేణికి కూడా పెళ్లిచేయాలనుకుంటుంది తన అమ్మ (వాణి విశ్వనాథ్).

అప్పటికే సుజన (హెబ్బ పటేల్)తో ప్రేమలో పడిన బుజ్జి, అమ్మ చూసిన సంబంధం ఇష్టంలేక కృష్ణవేణి ఇంటి నుంచి పారిపోతారు. వీళ్లిద్దరూ ఒకరి తర్వాత మరొకరు ఒకే ట్రయిన్ ఎక్కడం చూసిన ఆ ఊరి వ్యక్తి ఇద్దరూ కలిసి లేచిపోయారని
పుకారు పుట్టిస్తాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతుంటాయి. అదే టైమ్ లో హైదరాబాద్ లో అనుకోకుండా కలిసిన బుజ్జి-కృష్ణవేణి ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే ఊరిలో పుకారు గురించి తెలుసుకున్న బుజ్జి, ఎలా ఉంటుందో కూడా తెలియని కృష్ణవేణిపై కోపం పెంచుకుంటాడు. కృష్ణవేణికి కూడా బుజ్జిపై కోపం ఉంటుంది. ఈ క్రమంలో కృష్ణవేణి మేనమామ (రాజారవీంద్ర)కు ఆమెను అప్పగించేస్తాడు బుజ్జి.
ఫైనల్ గా బుజ్జి, తన కృష్ణవేణిని చేరుకున్నాడా లేదా.. గొడవలు పడుతున్న రెండు కుటుంబాల్ని ఎలా కలిపాడనేది స్టోరీ.

============================

naa-peru-surya-naa-illu-india-zeecinemalu

నా పేరు సూర్య
నటీనటులు : అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, R. శరత్ కుమార్, జానకి వర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, బోమన్ ఇరాని
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్, జాన్ స్టీవర్ట్ ఏడూరి
డైరెక్టర్ : వక్కంతం వంశీ
ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి, శిరీష లగడపాటి, బన్నీ వాస్
రిలీజ్ డేట్ : 4 మే 2018
సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు
కృష్ణంరాజు.
అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..? అసలు సూర్యకు కృష్ణంరాజుకు సంబంధం ఏంటి ? తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.

=========================

ntr-aravinda-sametha-zeecinemalu

అరవింద సమేత
నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్, నాగబాబు, రావు
రమేష్, నరేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018
కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.
అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే) పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి
ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

========================

manikarnika-zeecinemalu

మణికర్నిక
నటీనటులు : కంగనా రనౌత్, మొహమ్మద్ జీషన్ అయ్యుబ్
ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణి, జీషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, డానీ డెన్ జోంగ్ పా,
అంకిత లోఖాండే తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్
డైరెక్టర్ : క్రిష్
ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్, కమాల్ జైన్, నిశాంత్ పిట్టి
రిలీజ్ డేట్ : 25 జనవరి 2019
మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics