ప్రసన్న ఇంటర్వ్యూ

Saturday,December 02,2017 - 07:24 by Z_CLU

నాగార్జున ‘భాయ్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కోలీవుడ్ హీరో ప్రసన్న లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ సినిమాలో విలన్ గా నటించాడు… ఇటీవలే విడుదలై  పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి తన క్యారెక్టర్ గురించి లేటెస్ట్ గా  మీడియా తో ముచ్చటించాడు ప్రసన్న.. ఆ విశేషాలు ప్రసన్న మాటల్లోనే..

కరెక్ట్ టైంలో ..

నిజానికి ‘భాయ్’ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ట్రై చేయలేదు. కానీ ఒక మంచి క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేద్దామని వెయిట్ చేశా… కరెక్ట్ టైంలో ఈ క్యారెక్టర్ వచ్చింది. క్యారెక్టర్ వినగానే ఓ ఛాలెంజింగ్ గా అనిపించింది వెంటనే ఓకే చెప్పేశా. ఇదంతా దైవ నిర్ణయం అనుకుంటున్నా. నిజానికి మనకి ఏ టైంకి ఏది రాసుంటే అదే జరుగుతుందని నమ్ముతా.

 

వాళ్ళిద్దరి వల్లే ఈ క్యారెక్టర్

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ కి ప్రసన్న అయితే బాగుంటాడని .. కోన వెంకట్ గారు గోపి మోహన్ గారు రవి కి చెప్పారట.. వాళ్ళిద్దరి వల్లే  నాకు ఈ క్యారెక్టర్  లభించింది. ఇంతకు ముందు వాళ్ళని కలిసింది లేదు.. ఈ మధ్యే వాళ్ళిద్దరినీ కలిసి థాంక్స్ చెప్పాను.

మళ్ళీ మళ్ళీ నటించాలనుంది

సాయి ధరమ్ తేజ్ తో నటించడం చాలా ఈజీ.. చాలా సింపుల్ గా ఉంటాడు. షూట్ జరుగుతున్నప్పుడు తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి చాలా సహకరించాడు. సాయి ఎప్పుడు అడిగిన రోల్ ఏంటి అని అడగకుండా ఒక్క సీన్ అయినా చేయడానికి రెడీ గా ఉన్నా.. తనతో మళ్ళీ మళ్ళీ నటించాలనుంది.

ఆయనతో పోల్చడం హ్యాపీ

సినిమా చూసిన వాళ్ళు నా క్యారెక్టర్ ని అరవింద్ స్వామి గారి సిద్దార్థ్ అభిమన్యు క్యారెక్టర్ పోల్చడం చాలా హ్యాపీ.. సిద్దార్థ్ అభిమన్యు క్యారెక్టర్ అందరికీ ఓ రోల్ మోడల్ లాంటిది. ఆ క్యారెక్టర్ కి అరవింద్ స్వామి గారు 100 % న్యాయం చేశారు.  ఆయన నటనతో నా నటనను పోల్చడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఏ క్యారెక్టర్ అయినా ఓకే..కానీ

ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నా.. తెలుగులో అవకాశం వస్తే ఏ క్యారెక్టర్ అయినా సరే చేయడానికి రెడీ… కానీ నాకు ఛాలెంజింగ్ అనిపించే క్యారెక్టర్స్ వస్తే సంతోషిస్తా.

స్నేహ చూడలేదు .

తెలుగులో నేను సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో స్నేహ కోరిక. ఆమె కోరికతోనే భాయ్ సినిమా చేశాను. ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పగానే తను చాలా హ్యాపీ గా ఫీలయింది. ఇక జవాన్ సినిమా గురించి నా క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా సంతోష పడుతుంది. ప్రెజెంట్ షూటింగ్ లో ఉండటం వల్ల మొదటి రోజు ఇద్దరం కలిసి సినిమా చూడలేకపోయాం. రేపు తనతో కలిసి చెన్నై లో ఈ సినిమా చూడబోతున్నాను.

మరిన్ని క్యారెక్టర్స్ చేయాలనుంది

మన నటన నచ్చితే తెలుగు ప్రేక్షకులు మనల్ని ఇంతలో ఆరాధిస్తారో ఈ సినిమాతో తెలుసుకున్నాను. చాలా మంది సోషల్ మీడియా లో నా పెర్ఫార్మెన్స్ గురించి చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్ …