రీ ఎంట్రి కి రెడీ అవ్తున్న జెనిలియా

Saturday,December 02,2017 - 04:37 by Z_CLU

ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు- తమిళ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన క్యూట్ బ్యూటీ జెనిలియా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి.. బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశముఖ్ తో పెళ్లి తర్వాత  రెండు హిందీ సినిమాల్లో ఓ మరాఠి సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ లో రీ ఎంట్రి కి రెడీ అవుతుందట.

ఇటీవలే ఓ ప్రయివేట్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎటెండ్ అయిన జెనీలియా తన రీ ఎంట్రి గురించి ఫాన్స్ తో షేర్ చేసుకుంది. త్వరలోనే ఓ మరాఠి సినిమాలో నటిస్తున్నాని, అలాగే సౌత్ సినిమాల్లో కూడా నటించడానికి ప్లాన్ చేస్తున్నాని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మరి ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా ఇకపై హీరోయిన్ గానే కంటిన్యూ చేస్తుందా….లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్తుందా….తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే