Radheshyam రిలీజ్ ట్రైలర్ రెడీ !

Monday,February 28,2022 - 04:41 by Z_CLU

Prabhas’s ‘Radheshyam’ Release Trailer Date & Time announced

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , బ్యూటిఫుల్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ సినిమా మార్చ్ 11న తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

radheshyam-trailer-release-zeecinemalu

ప్రస్తుతం స్పెషల్ టీం ఈ ట్రైలర్ పై వర్క్ చేస్తున్నారు. మార్చ్ 2న మధ్యాహ్నం 3గంటలకు రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ , ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. మరి ఈ సినిమాను రిలీజ్ కి ముందు రాబోయే ఈ ట్రైలర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ? అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

గోపికృష్ణా మూవీస్ పై కృష్ణం రాజు సమర్పిస్తున్న ఈ సినిమాను యూ.వీక్రియేషన్స్ , టీ సిరీస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.  ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్ కంపోజ్ చేయగా ఎస్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics