Bheemla Nayak - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,February 28,2022 - 04:57 by Z_CLU

Bheemla Nayak 3 Days Collections

బ్లాక్ బస్టర్ భీమ్లానాయక్ వీరవిహారం కొనసాగుతోంది. ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ దుమ్ముదులిపాడు భీమ్లా. జస్ట్ 3 రోజుల్లో వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది పవన్ కల్యాణ్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో 53 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మొదటి రోజు అత్యథికంగా 26 కోట్ల రూపాయల షేర్ సాధించిన భీమ్లానాయక్, 3 రోజులు తిరిగేసరికి ఇలా కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది.

ఓవర్సీస్ లో భీమ్లానాయక్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. అంతేకాదు, ఆశ్చర్యంగా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 9 కోట్ల రూపాయల బిజినెస్ చేయగా, ఇప్పటికే 10 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

భీమ్లానాయక్ సినిమాకు వరల్డ్ వైడ్ ఇంకా 39 కోట్ల రూపాయలు వస్తే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. ప్రస్తుతం నడుస్తున్న బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ మొత్తం కలెక్ట్ చేయడం భీమ్లాకు చాలా ఈజీ. లాంగ్ రన్ లో ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 25.88 కోట్లు
సీడెడ్ – రూ. 7.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.66 కోట్లు
ఈస్ట్ – రూ. 3.60 కోట్లు
వెస్ట్ – రూ. 3.91 కోట్లు
గుంటూరు – రూ. 3.88 కోట్లు
కృష్ణా – రూ. 2.31 కోట్లు
నెల్లూరు – రూ. 1.81 కోట్లు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics