Interview - రష్మిక మందన్న

Monday,February 28,2022 - 04:08 by Z_CLU

ఇటివలే ‘పుష్ప’ సినిమాతో శ్రీవల్లిగా మెస్మరైజ్ చేసిన రష్మిక మందన్న మరికొన్ని రోజుల్లో ఆద్యగా అలరించడానికి రెడీ అవుతుంది. శర్వానంద్ – రష్మిక జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు‘ సినిమా మార్చ్ 4న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మీడియాతో ఆ సినిమా కబుర్లు చెప్పుకుంది. ఆ విశేషాలు తన మాటల్లోనే..

సినిమా ఒప్పుకోవడానికి రీజన్ అదే 

కిషోర్ గారు ఈ సినిమా స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు హిలేరియస్ గా నవ్వుకున్నాను. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ బాగా నచ్చింది. అలాగే సెకండాఫ్ లో ఒక సీన్ ఉంటుంది అది కూడా నా ఫేవరేట్. ఆ పార్ట్స్ నాకు బాగా నచ్చాయి. ఆ రెండు సీన్స్ వల్లే ఈ సినిమా ఒప్పుకున్నాను.

నిజంగా గొప్ప విషయమే 

ఇంత మంది ఆడవాళ్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ మీదే స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం గొప్ప విషయం. కిషోర్ గారిని అందుకు కచ్చితంగా అభినందించాల్సిందే. ఈ స్క్రిప్ట్ లో క్యారెక్టర్స్ గురించి చెప్తున్నప్పుడే ఈ క్యారెక్టర్స్ ఎవరు ప్లే చేస్తారు ? అనే క్వశ్చన్ రైజ్ అయింది. తర్వాత సీనియర్ యాక్ట్రెసెస్ రాధికా గారు , ఖుష్బు గారు , ఊర్వసి గారు చేస్తున్నారని తెలియగానే చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. షార్ట్ కి ముందు చాలా సరదాగా మాట్లాడతారు. కెమెరా ముందు కెళ్ళగానే మారిపోతారు. అందుకే హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగారనిపించింది. వారి నుండి అది నేర్చుకున్నాను.

శర్వా .. కూల్ 

శర్వానంద్ తో ఇది మొదటి సినిమా. తను చాలా కూల్ అండ్ కామ్. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాలో నాది స్ట్రైట్ ఫార్వార్డ్ క్యారెక్టర్ అయితే తను డ్రామా క్రియేట్ చేస్తూ మేనేజ్ చేసే క్యారెక్టర్. చిరుగా తను అందరినీ ఆకట్టుకుంటాడు.

పెళ్లికి… టైం ఉంది 

ఈ మధ్య నా పెళ్లి గురించి కొన్ని న్యూస్ లు చూశాను. ఇప్పుడే అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం యాక్ట్రెస్ గా మంచి రోల్స్ చేయాలి. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాను. కొందరు నా పెళ్లి గురించిఏవేవో రాస్తున్నారు. అవి చూస్తూ రాసుకోండి చిల్ అనుకుంటాను తప్ప ఎక్కువ పట్టించుకోను.

‘పుష్ప 2’ షూట్ ఇంకా టైం ఉంది 

నెక్స్ట్ ‘పుష్ప 2’ చేయాలి. మరో రెండు మూడు నెలల్లో ఆ షూట్ స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ సుకుమార్ గారు ఆ ప్రాసెస్ లో ఉన్నారు.

సెలెక్టీవ్ గానే వెళ్తా 

‘పుష్ప 2’ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ వచ్చిన ఆఫర్ ని బట్టి కాకుండా మంచి రోల్ అయితే చేయాలనుకుంటున్నాను. సెలెక్టీవ్ గానే వెళ్ళాలని చూస్తున్నాను.

 

వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది

ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. కిషోర్ గారు కీర్తి , సాయి పల్లవి ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నారని చెప్పగానే. నిజంగా వస్తున్నారా ? అని అడిగాను. వేదికపై వాళ్లను చూస్తే మహిళా శక్తిని చూసినట్లు అనిపించింది. కీర్తి, పల్లవి వాళ్ల వాళ్ల నటనతో ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. నాకు వాళ్లను చూస్తే ఆనందంగా ఉంటుంది.

ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం వెయిటింగ్ 

పుష్ప 2 తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ సైన్ చేశాను. కానీ దాని డీటెయిల్స్ చెప్పలేను. ప్రొడక్షన్ నుండి ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఆ ప్రకటన కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics