14 ఏళ్ల సినీజీవితం

Friday,November 11,2016 - 03:38 by Z_CLU

సిల్వర్ స్క్రీన్ బాహుబలి తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయి ఇవాళ్టికి 14 ఏళ్ళు. ఈశ్వర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభాస్… ఈ పద్నాలుగేళ్ళ సినిమా జర్నీలో, ఒక్కో సినిమాతో ఎదుగుతూనే,  అభిమానుల గుండెల్లో గూడు కట్టేసుకున్నాడు.

1-eeswar

ఈశ్వర్ సినిమాతో డెబ్యూ మూవీనే కదా అని జస్ట్ లవ్ స్టోరీ తో సరిపెట్టుకోకుండా, తనలో మంచి మాస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నాడు ప్రభాస్.

2-varsham

ప్రభాస్ కరియర్ లో కరెక్ట్ టైం లో పడింది ‘వర్షం’. ఈశ్వర్ నుండి స్టార్ట్ అయిన ప్రభాస్ సినిమా జర్నీకి ఈ సినిమా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఫ్యూచర్ లో ప్రభాస్ ఇంకా ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా ఆ క్రెడిట్ లో ఓ పాయింట్ ‘వర్షం’ కి కూడా పడాల్సిందే.

3-chatrapathi-copy

రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి… ప్రభాస్ ను ఆల్ టైం మాస్ ఇమేజ్ తో పాటు, స్టార్ రేస్ లోకి తీసుకొచ్చింది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్ టైన్ చేసిన ప్రభాస్ కి ఈ సినిమాతోనే స్టార్ డమ్ క్రియేట్ అయింది.

4-bujjigaadu

బుజ్జిగాడు సినిమా కంటే ముందు ప్రభాస్ నుంచి డిఫరెంట్ టైపు సినిమాలొచ్చాయి. కానీ బుజ్జిగాడు మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇందులో కనిపించినంత ఉత్సాహంగా, కొత్తగా ప్రభాస్ మరే సినిమాలో కనిపించలేదు. అందుకే ప్రభాస్ కెరీర్ లో మేకోవర్ మూవీ ఇది.

5-billa

ప్రభాస్ కరియర్ లోనే ఫస్ట్ రీమేక్. స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ స్టైలిస్ట్ మాస్ ఎంటర్ టైనర్… ప్రభాస్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేసింది.

6-darling

అప్పటికే మాస్ లో ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడు. అలాంటి మాస్ అప్పీల్ ఉన్న హీరోను క్లాస్ కు దగ్గర చేసిన సినిమా డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిసిమా ప్రభాస్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది క్లాస్ మూవీస్ గా నిలిచిపోతుంది.

7-mirchi-copy

కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్. ఏకంగా ప్రభాస్ ని 40 కోట్ల స్టార్ ని చేసేసింది. బాహుబలికి ముందు ప్రభాస్ కెరీర్  లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే.

8-bahubali

ప్రభాస్  కెరీర్ ను ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనే విధంగా చూడాలి. తెలుగు సినిమా చరిత్రలోనే కళ్లుచెదిరే రికార్డులకు కేరాఫ్ గా నిలిచింది బాహుబలి. ప్రభాస్ కు రికార్డుల మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా చేస్తున్న యంగ్ రెబల్ స్టార్… ఆ మూవీతో తన రికార్డుల్ని తానే బ్రేక్ చేయాలని  టార్గెట్ గా పెట్టుకున్నాడు.