గ్యాప్ తర్వాత మరింత ఫ్రెష్ గా...

Friday,November 11,2016 - 04:30 by Z_CLU

చేసే క్యారెక్టర్ స్పెషల్ గా ఉండాలి కానీ చిన్న క్యారెక్టర్ చేయడానికైనా రెడీగా ఉండే అంజలి.. సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్ తరవాత మళ్ళీ స్క్రీన్ పై కనిపించనే లేదు. ఎన్ని సినిమాలు చేశాం అనే దానికన్నా, ఎలాంటి సినిమాలు చేశాం అనే ఫార్ములాను పాటించే అంజలి… ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో అలరించిన అంజలి, ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న “అల్లుడు సింగం” సినిమాలో లాయర్ గా, పొలిటికల్ లీడర్ గా రెండు డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనుంది. ఇప్పటి వరకు గడుసు పిల్లలా స్క్రీన్ పై అలరించిన సీతమ్మ…ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుందో చూడాలి.