హిట్ కాంబో రిపీట్

Friday,November 11,2016 - 01:59 by Z_CLU

ఆక్సిజన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న గోపీచంద్,  ఆ సినిమాకి ఇంకా పేకప్ చెప్పకముందే… సంపత్ నంది సినిమా స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు కాకుండా, గోపీచంద్ ఇంకో డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాకపోతే ఈ డైరెక్టర్, గోపీచంద్ కి తక్కిన డైరెక్టర్స్ కన్నా కాస్త ఎక్కువ స్పెషల్. అతడే పరుచూరి మురళి.

   గోపీచంద్ కరియర్ లోనే మాస్ అప్పీల్ ని తీసుకొచ్చి పెట్టిన సూపర్ హిట్ మూవీ ఆంధ్రుడు. ఈ సినిమా దర్శకుడే పరుచూరి మురళి. ఆ దర్శకుడు ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆక్సిజన్ తో పాటు సంపత్ నంది సినిమా కూడా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వస్తుందని సమాచారం.