ప్రభాస్ రెండు సినిమాలు ఒకేసారి

Tuesday,February 28,2017 - 02:46 by Z_CLU

ఏప్రిల్ లో ప్రభాస్ బాహుబలి 2 రిలీజ్ అవుతుంది. మరో వైపు రీసెంట్ గా సుజిత్ డైరెక్షన్ లో తెరకేక్కనున్న్ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఇంటరెస్టింగ్ గా సినిమా షెడ్యూల్ తో పాటు, ఇంకో స్పెషల్ షెడ్యూల్ కూడా డిజైన్ చేసి పెట్టుకుంది సినిమా యూనిట్.

సినిమా సెట్స్ పైకి ఉండగానే టీజర్ రిలీజ్ చేయడం వెరీ న్యాచురల్. కానీ సినిమా కనా ముందే జస్ట్ టీజర్ షూట్ చేసి రిలీజ్ చేయడం సమ్ థింగ్ స్పెషలే. ప్రభాస్ బాహుబలి 2 కి సెట్ అయిన క్రేజ్ ని మైండ్ లో పెట్టుకునే దానికి ధీటుగా,  బాహుబలి 2 రిలీజ్ అయిన ప్రతి థియేటర్ లో… ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల బడ్జెట్ ని లాక్ చేసుకుంది. ఇంకా హీరోయిన్ కన్ఫం కానీ ఈ సినిమా సెట్స్ పై రాకముందే వైబ్రేషన్స్ ని జెనెరేట్ చేస్తుంది.