ప్రతీది ఇంట్రెస్టింగే..

Tuesday,February 28,2017 - 03:40 by Z_CLU

రామ్ చరణ్ సుకుమార్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుండి ప్రతీది ఇంటరెస్టింగే అనిపించుకుంటుంది. ఫస్ట్ లుక్ దగ్గరి నుండి 80’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ వెంచర్ కి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, ఎగ్జైటెడ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకు రాకముందే 80’s బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అనే క్లారిటీ అయితే ఇచ్చేశాడు కానీ, ఏ టైప్ లవ్ స్టోరీ అనేది మాత్రం సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. దానికి తోడు సమంతా ఫస్ట్ టైం చెర్రీ సరసన జత కడుతుంది. మరో వైపు DSP ఆల్ రెడీ ట్యూన్స్ కట్టడం బిగిన్ చేసేశాడు. ఇన్ని ఎగ్జైటెడ్ ఎలిమెంట్స్ మధ్య ఈ సినిమాలో మరో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ కన్ఫం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

క్యారెక్టర్ పాజిటివ్ ఉండబోతుందా… నెగెటివ్ ఉండబోతుండా పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, ఈ సినిమాలో వైభవ్ ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాడనే న్యూస్ ఆల్ మోస్ట్ కన్ఫం అనే టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో గొడవ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉన్న వైభవ్ కి ఈ సినిమాలో కాస్త పెద్ద స్పేసే కన్ఫం అయిందని తెలుస్తుంది.