‘అల్లరి అల్లుడు’ టైటిల్ ఫిక్స్

Tuesday,February 28,2017 - 01:36 by Z_CLU

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో నాగార్జున లోని రొమాంటిక్ ఆంగిల్ ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలివేట్ చేసిన కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఇప్పుడు నాగచైతన్య, మళ్ళీ అదే రేంజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మేకింగ్ లో బిజీ బిజీ ఉన్నాడు. అయితే ఇప్పటి దాకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ సినిమాకి ఒక ఇంటరెస్టింగ్ టైటిల్ ఫిక్సయిందన్న టాక్, టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.

సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీ లైన్ అయితే తెలీదు కానీ, సినిమా యూనిట్ మాత్రం ఈ సినిమాకి ‘అల్లరి అల్లుడు’ అని టైటిల్ ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ టైటిల్ తో నాగార్జున 1990 లోనే ఓ బ్లాక్ బస్టర్ హిట్ ని బ్యాగ్ లో వేసుకుని ఉన్నాడు.

అల్టిమేట్ రొమాంటిక్, యూత్ ఎంటర్ టైనర్స్ తో దూసుకుపోతున్న నాగచైతన్య సినిమాకి, ‘అల్లరి అల్లుడు’ లాంటి  టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నారంటే, ఈ జూనియర్ మన్మధుడు ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా టార్గెట్ చేసుకున్నాడనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక టైటిల్ సంగతి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే తేలిపోతుంది.