Pooja Hegde - రాధేశ్యామ్ నాకు చాలా స్పెషల్

Friday,July 23,2021 - 01:43 by Z_CLU

రాధేశ్యామ్ సినిమా తనకు చాలా స్పెషల్ అంటోంది పూజాహెగ్డే. చాన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించే అవకాశం వచ్చిందని, అందుకే తనకు ఇది చాలా స్పెషల్ అని చెబుతోంది.

pooja hegde new stills zeecinemalu

“సినిమాలో నా పాత్ర గురించి అప్పుడే మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు. అందుకే ప్రస్తుతానికైతే స్పందించలేను. సినిమా ప్రమోషన్ టైమ్ లో నా క్యారెక్టర్ గురించి చెబుతాను. అయితే ఒకటి మాత్రం చెప్పగలను. ఈమధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ ప్రేమకథ ఇదే. అటు ప్రభాస్ కూడా చాన్నాళ్ల తర్వాత రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. మా ఇద్దరి కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాను.”

pooja hegde new stills zeecinemalu

ఇలా రాధేశ్యామ్ పై తన లవ్ ను బయటపెట్టింది పూజా. పనిలోపనిగా షూటింగ్ అప్ డేట్స్ కూడా అందించింది. రాధేశ్యామ్ కు సంబంధించి మరో 10 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తామని చెబుతోంది.

pooja hegde new stills zeecinemalu

“రాధేశ్యామ్ దాదాపు పూర్తయింది. ఓ వారం లేదా 10 రోజుల షూట్ పెండింగ్ ఉంది. దాంతో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. పరిస్థితులు అనుకూలించిన తర్వాత, మార్కెట్ గాడిలో పడిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాతలు ఎనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను.”

pooja hegde new stills zeecinemalu 1

ప్రస్తుతం సౌత్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. తెలుగు-తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేయడంతో పాటు.. హిందీలో కూడా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. తన అప్ కమింగ్ మూవీస్ లైనప్ బయటపెట్టింది.

pooja Hegde latest stills

“ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళీ అనే సినిమా చేస్తున్నాను. ఇక రణ్వీర్ సింగ్ తో సర్కస్ అనే సినిమా చేస్తున్నాను. ఇక తెలుగులో ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు పూర్తయ్యాయి. తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్ అనే సినిమా చేస్తున్నాను.”

రీసెంట్ గా కరోనా బారిన పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని సినిమాల్లో బిజీ అయింది. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీని కోసం సొంతంగా ”ఆల్ ఎబౌట్ లవ్” అనే ఛారిటీని స్థాపించింది ఈ ముద్దుగుమ్మ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics