Ghani - వరుణ్ సినిమాకి బన్నీ సపోర్ట్

Friday,July 23,2021 - 03:43 by Z_CLU

Allu Arjun supports Varun Tej’s Ghani

మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ అనే కొత్త దర్శకుడితో ‘గని’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఈ సినిమాకు అల్లు అర్జున్ నుండి పూర్తి సపోర్ట్ లభించనుంది. తాజాగా గని సినిమా షూటింగ్ కి వెళ్లి కొన్ని సీన్స్ చూసి టీంని మెచ్చుకొని వచ్చాడు బన్నీ. అంతే కాదు తీసిన సన్నివేశాలు చూసి వరుణ్ ని అలాగే దర్శకుడిని అభినందించాడు.

అయితే బన్నీ ఈ సినిమా సెట్స్ కి వెళ్లదానికి కేవలం వరుణ్ మాత్రమే రీజన్ కాదు. మరో కారణం కూడా ఉంది. ఈ సినిమాకు బన్నీ అన్నయ్య అల్లు బాబీ అలియాస్ వెంకటేష్ ఒక నిర్మాత. మిత్రులతో కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ సినిమా నిర్మిస్తున్నాడు అల్లు బాబీ. తన అన్నయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో బన్నీ ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి షూటింగ్ వెళ్లి వచ్చాడు.

Varun Tej Ghani movie zeecinemalu

ఇక సినిమా రిలీజ్ కి ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్నీ స్పెషల్ గెస్ట్ ఎటెండ్ అయ్యే అవకాశం ఉంది. తన ఫ్యామిలీ హీరోతో అన్నయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకొని బన్నీ ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమవ్వనుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics