Venkatesh Rana - మరోసారి కలుస్తున్న దగ్గుబాటి హీరోలు

Friday,July 23,2021 - 01:24 by Z_CLU

Venkatesh Rana join hands for an OTT movie

వెంకటేష్ , రానా ఇద్దరూ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఓ సాంగ్ లో రానాతో కలిసి కనిపించి డాన్స్ చేశాడు వెంకీ. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని సురేష్ బాబు ట్రై చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. కాకపోతే దగ్గుబాటి కాంబో కనిపించేది బిగ్ స్క్రీన్ మీద కాదు… OTT లో.

అవును రానా ఓ OTT సంస్థకి వెబ్ సిరీస్ చేయాల్సి ఉంది. ఎప్పటి నుండో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇప్పటికి స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చింది. దర్శకుడెవరనేది తెలియదు కానీ ఈ సిరీస్ భారీ ఎత్తున ఉండనుందట. తొలి సారి వెంకీ , రానా కలిసి చేస్తున్న ఈ సిరీస్ ప్రమోషన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే షూట్ మొదలు పెట్టి ఎపిసోడ్స్ షూట్ చూసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

satish-vegesna-plans-manam-type-movie-with-venkatesh-rana2

ప్రస్తుతం వెంకటేష్ F3 సినిమాతో రానా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాతో బిజీ గా ఉన్నారు. ఇద్దరూ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ త్వరలోనే ఫినిష్ చేసి సిరీస్ షూట్ కి డేట్స్ ఇస్తారట. మరి వెంకటేష్ రానా తో కలిసి అన్ని ఎపిసోడ్స్ లో కనిపిస్తాడా ? లేదా కొన్ని ఎపిసోడ్స్ లో మాత్రమే మెరుస్తాడా ? చూడాలి. త్వరలోనే ఈ దగ్గుబాటి వెబ్ సిరీస్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics