మరో ఛాలెంజింగ్ పాత్రలో సూర్య

Wednesday,July 08,2020 - 01:01 by Z_CLU

కొత్త కొత్త క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకోవడం, ఆ పాత్రల కోసం తనను తాను మార్చుకోవడం సూర్యకు చాలా ఇష్టం. క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైనా పడతాడు ఈ హీరో. గజనీ నుంచి గమనిస్తే, పాత్రల విషయంలో సూర్య ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో అర్థమౌతుంది. తాజాగా మరో ఛాలెంజింగ్ రోల్ కు రెడీ అవుతున్నాడు ఈ నటుడు

తమిళనాట ఫేమస్ అయిన జల్లి కట్టు బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. రంకెలేసే ఎద్దును అదుపుచేసే పాత్ర కోసం, జల్లికట్టు వీరుడిగా కొత్తగా ముస్తాబవ్వబోతున్నాడు. ఈ సినిమాలో మరో స్పెషాలిటీ కూడా ఉంది.

వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో తండ్రికొడుకుగా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు సూర్య. నిజానికి ఈ సినిమాలో తండ్రి పాత్ర కోసం సత్యరాజ్ లేదా రాజ్ కిరణ్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ పాత్రను కూడా తనే పోషించాలని సూర్య డిసైడ్ అయ్యాడు.

తండ్రికొడుకు పాత్రలు ఈ హీరోకు కొత్తకాదు. ఇంతకుముందు సూర్య సన్నాఫ్ కృష్ణన్, 24 అనే సినిమాల్లో తండ్రికొడుకుగా నటించాడు సూర్య. ఇప్పుడు వెట్రిమారన్ మూవీలో కూడా మరోసారి తండ్రిగా, కొడుకుగా కనిపించబోతున్నాడు.