పాయల్ రాజ్ పుత్ ‘RDX లవ్’ ట్రైలర్ రివ్యూ

Tuesday,September 10,2019 - 07:44 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన టీజర్ డిఫెరెంట్.. ఈ రోజు రిలీజైన ట్రైలర్ డిఫెరెంట్. ఓ రకంగా చెప్పాలంటే టీజర్ లో ఏ మాత్రం కథ రివీల్ చేయని మేకర్స్, ట్రైలర్ లో సినిమా ఎలా ఉండబోతుదన్నది రివీల్ చేశారు. అల్టిమేట్ గా ‘RDX లవ్’  లో జస్ట్ గ్లామర్ షో ఒక్కటే కాదు అంతకన్నా స్ట్రాంగ్ కథ ఉందనిపిస్తుంది.

ఈ రోజు రిలీజైన ట్రైలర్ ని బట్టి పాయల్ రాజ్ పుత్ ‘RDX లవ్’ లో స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుందనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ‘వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగసింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది’ అనే డైలాగ్ హీరోయిన్ క్యారెక్టర్ లో హీరోయిజం ఉందనిపిస్తుంది. కాకపోతే సినిమాలో ఆ ఊరికి వచ్చిన కష్టం ఏంటదనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు మేకర్స్.

‘RDX లవ్’ లో పాయల్ రాజ్ పుత్ గ్లామర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ అడిషనల్ బోనస్ అనిపిస్తుంది. శంకర్ భాను డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి C. కళ్యాణ్ ప్రొడ్యూసర్.