బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అఖిల్ ?

Tuesday,September 10,2019 - 07:51 by Z_CLU

ప్రెజెంట్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు అఖిల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఈ సినిమా తర్వాత అఖిల్ పరశురాంతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. గతేడాది ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు మహేష్ కోసం కథను సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా కంటే ముందు అఖిల్ ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాను కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతైనికైతే ఈ సినిమాపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ టాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందా.. లేదా తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి అఖిల్ ఫోకస్ అంతా ఇప్పుడు చేస్తున్న సినిమా మీదే ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాతే అతని నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఉండొచ్చు.